తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైన అధికారం చేపట్టాలని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు వచ్చిన రాహుల్ మరోమారు ఈనెలలో పర్యటించనున్నారు. ఈ నెల 17న తెలంగాణ కు ప్రియాంక ,రాహుల్ రానున్నారు. 17న నిజామాబాద్‌లో మహిళా డిక్లరేషన్ చేయనున్నారు. కాంగ్రెస్ ఈ సారి ఎలక్షన్స్‌లో మహిళల ఓట్లే కీలకమని భావిస్తోంది. అందుకే దాని మీద ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది కాంగ్రెస్. అప్పుడు కూడా మహిళా ఓటర్లకు గాలం వేసి గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే చేయాలనుకుంటోంది. అందులో భాగంగా దసరా పండుగ, బతుకమ్మ రోజునే మహిళా డిక్లరేషన్ ఎనౌన్స్ చేయాలని భావిస్తోంది. 6 గ్యారంటీలకు అదనంగా ఇంకా కొత్త పథకాలు ప్రకటించనుంది.
పూర్తిగా చదవండి..RAHUL, PRIYANKA TOUR:తెలంగాణలో రాహుల్, ప్రియాంకల పర్యటన
తెలంగాణలో రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. దానికి తగ్గట్టు పార్టీలు ప్రచారాలు ప్రాంభించాయి. బీజెపీ, కాంగ్రెస్ కేంద్ర నాయకులను తెలంగాణ పర్యటనకు తీసుకొస్తున్నారు. మోదీ ఇప్పటికే రెండు సార్లు వచ్చి వెళ్ళారు. ఇప్పడు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక తెలంగాణకు రానున్నారు.

Translate this News:











