Rahul Gandhi on PM Museum : నెహ్రూ స్మారక చిహ్నం పేరు మార్చడంపై రాజకీయా దుమారం రేగింది. ఈ నేపథ్యలో ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు. నెహ్రూజీని ఆయన పేరుతో పిలుస్తారని…ఆయన చేసిన మంచి పనుల వల్లే ఆయన గుర్తింపు పొందారని రాహుల్ గాంధీ అన్నారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఆగస్టు 14 నుంచి కొత్త పేరు అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ మార్పుకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే కేంద్రం విధానాలను లక్ష్యంగా చేసుకుంది. నిత్యం దాడులు జరుగుతున్నప్పటికీ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారసత్వం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని, రాబోయే తరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..నెహ్రూ మెమోరియల్ పేరు మార్చడంపై తొలిసారి స్పందించిన రాహుల్..ఏమన్నారంటే..!!
నెహ్రూ మెమోరియల్ పేరును పీఎం మ్యూజియం అండ్ లైబ్రరీగా ప్రభుత్వం మార్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీకి కాంగ్రెస్ ముచ్చెమటలు పట్టించింది. గతంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధి తొలిసారిగా స్పందించారు. నెహ్రూ పేరు మార్చినంత మాత్రాన ఆయన చేసిన పనులు ప్రజల మనస్సుల్లోనుంచి తొలగించలేరన్నారు. పనుల్లో ఆయన తర్వాతే ఎవరైనా అంటూ ప్రధానిమోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.

Translate this News:











