Rahul Gandhi, Mallikarjun Kharge meet: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలు కోసం కాంగ్రెస్ పార్టీ చాలా ముందుగానే కసరత్తు ప్రారంభించేసింది. రాష్ట్రాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టింది. సోమవారం ఢిల్లీ జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి నేతలను పిలిపించి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిపై ఆరా తీయగా.. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(mallikharjun kharge), వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi) నేతృత్వంలో ఇవాళ (ఆగస్టు 16) పార్టీ ఢిల్లీ యూనిట్‌తో కీలక భేటీ జరిగింది.
పూర్తిగా చదవండి..గెలుపు గుర్రాల వేట..ఇక కాస్కో..! ఇక మాములుగా ఉండదు!
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో కీలక మీటింగ్ జరగగా.. అజయ్ మాకెన్, హరూన్ యూసుఫ్, కృష్ణ తీరథ్, సందీప్ దీక్షిత్ సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ఎలాంటి సిఫార్సులను లెక్కచేయకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

Translate this News:













