పుల్వామా దాడులు, అదానీ వ్యవహారం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, అగ్నివీర్ తోపాటు పలు అంశాలపై జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చర్చించారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్లో అప్ లోడ్ చేశారు. ఈ క్రమంలో చాలా విషయాల గురించి ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయాన్ని రాహుల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా రాహుల్ పోస్టు చేశారు. తమపై ఈడీ, సీబీఐల ప్రమేయం ఉంటుందా అంటూ మోదీ సర్కార్ పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi : సత్యపాల్ మాలిక్‌తో రాహుల్…పుల్వామా దాడులు, అదానీ గురించి చర్చించా..!!
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు సంధించారు. సెక్షన్ 370ని తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితులను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. బీజేపీ నియమించిన గవర్నర్ గా పనిచేసిన సత్యపాల్ మాలిక్, పదవీ విరమణ అనంతరం బీజేపీ అగ్రనాయకత్వంపై..మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Translate this News:











