కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల సింప్లిసిటీగా మారుపేరుగా నిలుస్తున్నారు. రైతులతో కలిసి నాట్లు నాటడం, లారీ డ్రైవర్లతో కలిసి ట్రక్కు నడపడం, చాక్లెట్ తయారుచేయడం, మార్కెట్‌కి వెళ్లి వ్యాపారులతో సందడి చేయడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లారు రాహుల్. అక్కడ ఇద్దరు రాజకీయాలతో పాటు సరద సంభాషణలు చేసుకున్నారు. అనంతరం వంటలో బిజీ అయిపోయారు. మటన్ ఎలా వండాలి.. మసాలా ఎలా వేయాలని లాలూ చెబుతుంటే రాహుల్ వండేశారు. అనంతరం ఇద్దరు చక్కగా తినేసి ముచ్చట్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: ఈసారి లాలూ శిక్షణలో మటన్ వండిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈసారి చెఫ్ అవతారం ఎత్తారు. మొన్న చాక్లెట్ తయారీ చేసిన రాహుల్ తాజాగా మటన్ వండారు. అది కూడా ఆర్జీడీ అధినేత, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో ఆయన శిక్షణతో వేడి వేడి మటన్ రెడీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Translate this News:











