ఇటీవల అదాని గ్రూప్ సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ బయటపెట్టిన విషయాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మోసపూరిత లావాదేవీలు, స్టాక్ మార్కెట్లో తారుమారు చేయడం లాంటి అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పార్లమెంటు సమావేశాల్లో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అదాని వ్యవహారాన్ని లేవనెత్తి మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రాహుల్ మరోసారి అదాన్ గ్రూప్ సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్‌వాయిస్‌లోతో ప్రజలు విద్యుత్తుకు ఎక్కువ బిల్లులు చెల్లించేలా చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతోందని మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఆయన ఉటంకించారు. అయితే ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు దర్యాప్తు చేసేందుకు ఆదేశించడం లేదంటూ ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదాని గ్రూప్‌పై దర్యాప్తు చేస్తాం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
రాహుల్‌గాంధీ మరోసారి అదాన్ గ్రూప్ సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్‌వాయిస్‌లోతో ప్రజలు విద్యుత్తుకు ఎక్కువ బిల్లులు చెల్లించేలా చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతోందని మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఆయన ఉటంకించారు.

Translate this News:











