Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే, తాజాగా కుత్బుల్లాపూర్(Quthbullapur) నియోజకవర్గం పరిధిలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద(MLA Vivekanand).. అదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి ఘటనపై తాజాగా క్లారిటీ ఇచ్చారు వివేకానంద. ఆ కారణంగానే చేయి చేసుకోవాల్సి వచ్చిందంటే వివరణ ఇచ్చారు వివేకా.
పూర్తిగా చదవండి..Telangana Elections: ఆ ఒక్క మాట వల్లే కొట్టాను.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేకానంద..
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ పై చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై తాజాగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. గొడవపై వివరణ ఇచ్చారు. శ్రీశైలం తన తండ్రిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం వల్లే తాను క్షణికావేశానికి గురైనట్లు వివరణ ఇచ్చారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

Translate this News:











