నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గం చౌరస్తాలో మాజీ ప్రధాని పీసీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మాజీ ప్రధాని కొడుకు పీవీ ప్రభాకర్ రావు, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. పీవి నరసింహారావు విగ్రహం ఏర్నాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పీవి నరసింహారావు రాష్ట్ర ప్రజలకు స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకున్న వారికి కొత్తగా ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుందన్నారు.
పూర్తిగా చదవండి..పీవీ నరసింహారావు జీవితం మనకు ఆదర్శం: కవిత
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు పట్వారీ నుంచి ప్రధానిగా ఎదిగిన తీరును కవిత వెల్లడించారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ శాఖ ద్వారా మానవ వనరులు ఏవిధంగా సృష్టించుకోవాలో ఆలోచించి రాను రాను ఆ శాఖకు కొత్త పదాలు జోడించారన్నారు.

Translate this News:











