Psycho Lover: రంగారెడ్డి జిల్లా నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్ ఆదివారం దారుణానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని క్లాస్ మేట్ సంఘవిపై దాడికి యత్నించాడు. అడ్డుకున్న సంఘవి సోదరుడు పృథ్వీని కత్తితో 50 సార్లు పొడిచి అతి కిరతకంగా చంపాడు. ఎల్బీనగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్.. షాద్ నగర్ లోని స్కూల్ లో తనతో పాటు చదువుకున్న సంఘవిని ప్రేమించాడు. అప్పటి నుంచే సంఘవిని ప్రేమ పేరుతో వేధించేవాడు.
పూర్తిగా చదవండి..Psycho Lover: లవర్ కాదు కిల్లర్..50 సార్లు కత్తితో పొడిచి..!
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ప్రేమోన్మాది దాడి ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో యువతి, సోదరుడి పృథ్వీపై శివకుమార్ అతిదారుణంగా హత్యచేశాడు. కత్తితో 50 సార్లు పొడిచి అతి కిరతకంగా చంపాడు. అయితే ఈ కేసులోని నిందితుడు శివకుమార్ ది మొదటి నుంచి ఉద్రిక్త స్వభావమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే ప్రేమ విషయంలో కన్న తండ్రి అతనిని మందలిస్తే తనను సుత్తితో కొట్టి చంపాడని అయితే ఈ హత్య విషయాన్ని గ్రామస్తులు బయటకు రానివ్వలేదని సమాచారం. పృథ్వి హత్య కేసు భయటికి రావడంతో పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. శివకుమార్ గతంలో చేసిన నేరాలకు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా కూపీ లాగుతున్నారు.

Translate this News:











