టీఎస్పీఎస్సీ.. ఈ పేరు వింటేనే నిరుద్యోగులు ఆగ్రహానికి గురవుతున్నారు. గ్రూప్ పరీక్షలు రద్దు కావడం, వాయిదాలు పడుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరిని వదిలేసి పట్టణాలు, నగరాలకు వచ్చి చదువుకుంటున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అశోక్‌నగర్ హస్టల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రవళిక అనే ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. శుక్రవారం రోజున రాత్రి హాస్టల్ గదిలో ఆమె ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక హన్మకొండలోని గీతాంజలి కళాశాలలో డిగ్రీ ఎంపీసీఎస్ పూర్తి చేసింది. ప్రవళిక తల్లిదండ్రులు మర్రి లింగయ్య, తల్లి మర్రి విజయ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్లకు ఉన్నటువంటి ఒక ఎకరంతో పాటు గ్రామంలోని మరి కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ప్రవళికకు తమ్ముడు ప్రణయ్ కుమార్ ఉన్నాడు. పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచాలని కలలు గన్న ప్రవళిక తల్లిదండ్రులు ఆమె డిగ్రీ పూర్తి కాగానే గ్రూప్స్ కోచింగ్‌కు హైదరాబాద్‌కు పంపారు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆర్సీ రెడ్డి విద్యా భవన్ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. దాదాపు 6 నుంచి 7 లక్షల రూపాయలను రెండు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకు, హాస్టల్ ఫీజులకు చెల్లించారు.
పూర్తిగా చదవండి..Telangana: నన్ను క్షమించండి అమ్మా.. కన్నీరు పెట్టిస్తున్న ప్రవళిక కథ..
టీఎస్పీఎస్సీ.. ఈ పేరు వింటేనే నిరుద్యోగులు ఆగ్రహానికి గురవుతున్నారు. గ్రూప్ పరీక్షలు రద్దు కావడం, వాయిదాలు పడుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరిని వదిలేసి పట్టణాలు, నగరాలకు వచ్చి చదువుకుంటున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అశోక్‌నగర్ హస్టల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రవళిక అనే ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Translate this News:











