మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా శామీర్పట మండల పరిధిలోని బొమ్మరాసిపేటలో లబ్ది దారులకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతున్న సమయంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఉన్న 380 మంది లబ్దిదారులకు ఒకే సారి పట్టాలు ఇస్తానని చెప్పి.. ఇప్పుడు విడతల వారీగా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దీంతో కోపంతో ఊగిపోయిన మల్లారెడ్డి అది అడగడానికి మీరెవరని గ్రామస్తులపై ఫైర్ అయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. గ్రామస్తులు మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..Bommarasipeta: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టాలు లబ్దిదారులకు కాకుండా తన అనుచరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.

Translate this News:











