చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శుక్రవారం పుంగనూరులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. నియోజకవర్గ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. నల్లజెండాలను, నల్ల బెలూన్లను ఎగురవేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
పూర్తిగా చదవండి..పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసనలు
చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాయలసీమకు మంజూరైన ఎయిమ్స్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను సైతం అమరావతికి తరలించాడంటూ ధ్వజమెత్తారు. పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని ఆరోపించారు. రెండు నీటి ప్రాజెక్టులను పుంగనూరులో ఏర్పాటు చేయకుండా కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయలేదని..

Translate this News:











