KS Ramarao: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత కేఎస్ ప్రధాని మోదీకి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. మీకు తెలియకుండానే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయించిందా? అని లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు ఆయన. “మీరు జీ20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో.. అందుకు సహకరించిన మీ పార్టీపై కూడా అంతే కోపం ఉంది. కానీ 2014 ఎన్నికల్లో మీకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీటు వచ్చిందంటే అది చంద్రబాబు వల్లనే” అని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..KS Ramarao: మీకు తెలియకుండానే చంద్రబాబును అరెస్ట్ చేస్తారా..? ప్రధాని మోదీకి ప్రముఖ నిర్మాత లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత కేఎస్ ప్రధాని మోదీకి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. మీకు తెలియకుండానే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయించిందా? అని లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు ఆయన

Translate this News:











