OpenAI might to bankrupt by 2024: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)కి మాన్యూవల్ కష్టాలు పెరుగుతున్నాయి. అంటే డబ్బుల కష్టాల అన్నమట. ఇటివలే ఆండ్రాయిడ్‌లో దర్శనమిచ్చిన ఓపెన్ఏఐ(OpenAI)కి చెందిన ఛాట్‌జీపీటీ యాక్టివ్ యూజర్ల సంఖ్యను క్రమక్రమంగా కోల్పోతూ వస్తోంది. ఇదే సమయంలో ‘ఓపెన్ఏఐ’కి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఛాట్‌జీపీటీని రన్ చేసేందుకు రోజుకు ఏకంగా 5 కోట్ల ఖర్చు అవుతుందట. ఓవైపు యూజర్ల సంఖ్య తగ్గుతూ ఉండడంతో పాటు ఖర్చు పెరుగుతూ ఉండడంతో కంపెనీ దివాలా తీసే అవకాశాలున్నాయి నివేదికలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..ChatGPT: అస్సాం ట్రైన్ ఎక్కనున్న ఛాట్‌జీపీటీ.. దివాలా తీయనున్న ‘ఓపెన్ ఏఐ’!
'ఓపెన్ఏఐ'(OpenAI) నష్టాలు పేరుకుపోతున్నాయి. ఛాట్‌జీపీటీ కోసం రోజుకు 5 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని కారణంగా సామ్ ఆల్ట్‌మన్ కంపెనీ నష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఓవైపు ఛాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతుండడంతో పాటు ఖర్చు పెరిగిపోతుండడంతో 2024చివరి నాటికి 'ఓపెన్ఏఐ' దివాలా తీసే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఈ భారాన్ని భరిస్తున్నట్టు సమాచారం.

Translate this News:











