ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 104వ మన్‌కీబాత్‌లో భాగంగా ఆదివారం మాట్లాడిన ఆయన.. మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలతో బంధం ఏర్పడుతుందన్నారు. దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు ఒకటన్నారు. తెలుగు సాహిత్యం, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన వెలకట్టలేని అద్భుతాలు ఉన్నాయన్నారు. తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అలాగే, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తిగా చదవండి..PM Modi: ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తాం
ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ 29న తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటన్నారు. మరోవైపు ఇస్రో సాధించిన విజయంలో మహిళల పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు. భారత్ జీ20 దేశాలకు నేతృత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు.

Translate this News:












