తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు ధరలు పెరిగాయి. మిగతా పప్పుదినుసులు అదే ధరలో ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక వాడే కందిపప్పు ధర రెండు నెలల వ్యవధిలోనే రూ. 30కిపైగా పెరిగింది. జూలైలో 150 రూపాయాలు ఉన్న కందిపప్పు.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో 180 రూపాయాలు ఉంది. కొన్ని ప్రాంతాల్లో 200 రూపాయల వరకు ఉంది. ఇతర పప్పుల ధరలు రూ.20 నుంచి 40 వరకు పెరిగాయి. అయితే ధర పెరగటానికి కారణం రాష్ట్రంలో పప్పు దినుసుల సాగువిస్తీర్ణం తగ్గడం, వాతావరణ ప్రతికూల పరిస్థితులతో దిగుబడి తగ్గటం వల్ల ఆ ప్రభావం ధరలపై పడింది. కంది పంటను తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఈ తెలుగురాష్ట్రాల్లో వరి, ఇతర వాణిజ్య పంటల సాగు పెరిగింది. దీంతో కంది సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. కంది పప్పులో తాండూరు, కోల, నాగపూర్, దేశీయరకాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది.
పూర్తిగా చదవండి..Price Hike: సామాన్యులకు షాక్.. పెరిగిన కందిపప్పు, మినప, శనగ ధరలు.. కిలో ఎంతంటే..?
ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజల చుక్కలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో ఒక కిలో కందిపప్పు 200 రూపాయలు ఉంది. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా కందిపప్పు అందించేవారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అరకొరగానే పంపిణీ చేస్తున్నారని రేషన్ కార్డుదారులు వాపోతున్నారు.

Translate this News:











