విశాఖ: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు సరైన రోడ్లు, సౌకర్యాలు ఇప్పటికీ లభించడం లేదు. ఇప్పటికీ అక్కడి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే డోలి మోతల కష్టాలు తప్పడం లేదు. వాళ్లు ఏజెన్సీ ప్రాంతాల నుంచి నడుచుకుని వెళ్లే లేపు.. దారిలోనే ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ గర్భిణికి వైద్యం అందక.. మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటన ముంచంగిపుట్టు మండలంలో జరిగింది.
పూర్తిగా చదవండి..అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం.. డోలిలో ఆస్పత్రికి వెళ్తూ గర్భణి మృతి!!
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం ఉబ్బెంగికి చెందిన బసంతి అనే మహిళకి పురిటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు డోలీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వాళ్ల గ్రామం నుంచి అల్లూరి జిల్లాకు వెళ్లాలంటే 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈక్రమంలో పురిటి నొప్పులు మరికాస్త ఎక్కువై.. మహిళ దారిలోనే మరణించింది.

Translate this News:











