PM Kisan Samman Nidhi 15th Installment: వ్యవసాయానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం, వ్యవసాయానికి సహాయం అందించడం, విత్తనాలు, ఇతర సౌకర్యాలను అందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు ఉపయోగకరంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను(PM Kisan Samman Nidhi)అమలు చేస్తుంది. ఇప్పటికే 14 విడతలుగా నిధులు రైతులు(Farmers) ఖాతాల్లో జమ అవగా.. 15వ విడత నిధులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 27వ తేదీన రైతుల ఖాతాల్లో 14వ విడతకు సంబంధించిన నిధులు పడ్డాయి. ఇప్పుడు రైతులందరూ 15వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ విడత అంటే, 15వ విడత నిధులు పడాలంటే.. రైతులు కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. అవి పూర్తి చేస్తేనే వారి ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు పడతాయి. లేదంటే.. ఆ నిధులు నిలిచిపోతాయి. అందుకే లబ్దిదారులైన రైతులు తప్పనిసరిగా ఈ 3 పనులు చేయాలని చెబుతున్నారు అదికారులు. మరి ఆ 3 కీలక అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పన ఏడాదికి మొత్తం రూ. 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పథకాన్ని ఫిబ్రివరి 14, 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 దఫాలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అయితే, 15వ విడత నిధులు పొందాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాల్సిందే.

Translate this News:











