కన్నప్ప సినిమాలో యంగ్ రెబల్ స్టార్ నటిస్తాడని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు కానీ…పరోక్షంగా హింట్ అయితే ఇచ్చింది. దాంతో పాటూ ఇందులో నయనతార కూడా యాక్ట్ చేస్తోందనే సమాచరం కూడా బయటకు వచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెబుతున్న ఈ సినిమా కోసం 100 కోట్లను ఖర్చుపెడుతున్నారు. షూటింగ్ అంతా న్యూజిలాండ్‌లోనే జరగనుంది అని….దీని కోసం 7 కంటైనర్ల సెట్ ప్రాపర్టీస్ అక్కడ చేరుకున్నాయని చెబుతున్నారు. కన్నప్ప సినిమాకు స్టార్ ప్లస్‌లో మహాభారత్ సీరియల్ తీసిన ముఖేష్ సింగ్ దర్శకత్వం చేస్తున్నారు. ఇకపోతే శివుడిగా ప్రభాస్ నటిస్తాడు అన్న విషయం గురించి కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ టాక్.
పూర్తిగా చదవండి..PRABHAS AS SIVA:శివుడి రూపంలో ప్రభాస్…సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏఐ ఫోటోలు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తుండగా శివుడిగా ప్రభాస్, పార్వతిగా నయనతార నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఐ టెక్నాలజీతో శివుడిగా ప్రభాస్ ఫోటోలు డిజైన్ చేశారు అతని అభిమానులు. ఇప్పుడు అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Translate this News:













