Pooja Hegde Birthday Pics Viral: బాలీవుడ్ నుంచి వచ్చి మళ్ళీ బాలీవుడ్ కే వెళ్ళిపోయింది పూజా హెగ్డే. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోల పక్కనా నటించిన ఈమె తన ఖాతాలో మాత్రం పెద్దగా హిట్ లను వేసుకోలేకపోయింది. కొన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న పూజా మళ్ళీ బాలీవుడ్ లో బిజీ అవుతోంది. తాజాగా షాహిద్ కపూర్ పక్కన సినిమా చేస్తోంది. పూజా హెగ్డే పుట్టినరోజును ఆన్ లొకేషన్ సెలబ్రేట్ చేస్తూ షాహిద్ టీమ్ పూజకు గ్రాండ్ వెల్కం చెప్పింది. షాహిద్ కపూర్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, దర్శకుడు రోషన్ ఆండ్రూస్‌తో కలిసి తన కొత్త చిత్రం సెట్స్‌లో బర్త్ డే బేబి పూజా ఉల్లాసంగా గడిపారు. సెట్స్ పైకి పూజా హెగ్డేని స్వాగతిస్తూ, రాయ్ కపూర్ ఫిల్మ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ప్రయాణంలో బర్త్ డే బేబీ పూజా మాతో చేరడంతో థ్రిల్లింగ్ యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ మరింత ఎగ్జయిట్ మెంట్ ని పెంచుతోంది. మా లవ్లీ లీడింగ్ లేడీకి సంతోషకరమైన రోజు శుభాకాంక్షలు! అని అందులో రాసారు. ఇందులో పూజా హెగ్డే కేక్ కట్ చేస్తున్న పిక్ ని కూడా జత చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..MOVIES:టూ హాట్ లుక్ తో చంపేస్తున్న పొడుగుకాళ్ళ సుందరి
పొడుగుకాళ్ళ పాప పుజా హెగ్డే సడెన్ గా డల్ అయిపోయింది. టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేసినా పెద్దగా ఏవీ హిట్ అవ్వలేదు. దాంతో టాలీవుడ్ సర్కిల్స్ నుంచి మిస్సయిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ కెరీర్ ని చక్కదిద్దుకునే పనిలో ఉంది. తాజాగా ఈ భామ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన ఒక సినిమా చేస్తోంది.

Translate this News:











