సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే బరిలో ఉంటాడని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. పార్టీ అధిష్టానంతో సీపీఐ చర్చలు జరుపుతుందని తెలియడంతో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారన్నారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడినట్లు మాజీ ఎంపీ తెలిపారు. వారికి భరోసా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Ponnam Prabhakar: హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్‌దే
హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థే పోటీ చేస్తారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. ప్రజలు ఆశీర్వదిస్తే హుస్నాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమన్నారు.

Translate this News:











