కేసీఆర్కు (CM KCR) దమ్ముంటే పాలేరు నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సవాల్ విసిరారు. శనివారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. నిన్నటి సభలో ఆయన పక్కన కూర్చుంది ఎవరు? ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు లేదన్నారు. నిన్నటి సభలో కేసీఆర్ తన పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించారన్నారు. పేరు చెప్పి ఉంటే తన సత్తా ఏమిటో తెలిసేదని అన్నారు. ఇప్పటికీ తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఉమ్మడి ఖమ్మంలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా గెలవనిచ్చేది లేదన్నారు. కాంగ్రెస్కు 80 నుంచి 82 సీట్లు వస్తున్నాయన్నారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని జోస్యం చెప్పారు.
ఇది కూడా చదవండి: DK Shiva Kumar: కర్ణాటకకు రండి చూపిస్తాం.. కేసీఆర్, కేటీఆర్ కు డీకే శివకుమార్ సవాల్
CM KCR Vs Ponguleti: నీ పతనానికి మేడిగడ్డ చివరి మెట్టు.. దమ్ముంటే పాలేరుకు రా.. కేసీఆర్కు పొంగులేటి సవాల్
సీఎం కేసీఆర్ పతనానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఘటన చివరి మెట్టు అని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. దమ్ముంటే పాలేరులో తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా గెలవనిచ్చేది లేదన్నారు.

Translate this News:











