మరికొన్ని రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దాని ప్రకారం తెలంగాణలో సమస్యాతక్మంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ను సాయంత్రం నాలిగింటి వరకే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి,ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వారావుపేట, భద్రాచలం ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఇవి కాక తెలంగాణలోని మిగిలిన 106 స్థానాల్లో మాత్రం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
పూర్తిగా చదవండి..Telangana Elections: 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్
తెలంగాణ ఎన్నికల్లో సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో 13 ఏరియాలను సమస్యాత్మక ప్రాంతాలుగా నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది.

Translate this News:











