ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. బ్యారేజీ డ్యామెజ్పై స్పందించిన ఎస్పీ కిరణ్ ఖారే.. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. బ్యారేజీ వంతెన పిల్లర్లపై పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఫోరెన్సీక్ క్లూస్ టీం సాయంతో కూడా ఆధారాలు సేకరిస్తున్నామని.. కేంద్ర కమిటీ కూడా బ్యారేజీని పరిశీలించిందని చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని.. ప్రస్తుతం మా దర్యాప్తు కొనసాగతుందని తెలిపారు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో ఉన్నందున ఎవరినీ అక్కడికి అనుమతించడం లేదని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై పోలీసుల కీలక ప్రకటన.. ఏం అన్నారంటే..
మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. బ్యారేజీ వంతెన పిల్లర్లపై పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని.. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫోరెన్సీక్ క్లూస్ టీం సాయంతో కూడా ఆధారాలు సేకరిస్తున్నామని.. ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా బ్యారేజీని పరిశీలించిందని చెప్పారు.

Translate this News:











