తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17వ తేదీన భారీ బహిరంగసభను నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈ సభను హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ను చేస్తోంది ఆపార్టీ. కాంగ్రెస్ అగ్రనేతలు అయిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ సభకు హాజరుకానున్న నేపథ్యంలో ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీపీసీసీ. 10లక్షల మంది జనసమీకరణ చేయాలని భావిస్తోంది. అటు పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా సభను నిర్వహించి తీరుతామని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..Tukkuguda : తుక్కుగూడ సభకు పోలీసులు అనుమతి..పదివేల మంది దాటకూడదని కండీషన్..!!
తెలంగాణ కాంగ్రెస్ విజయభేరీ సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో విజయభేరి పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. మొదట్లో ఈ సభకు దేవాదాయ శాఖ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వడంతో సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

Translate this News:











