Delhi Police hit by SUV: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ లో దారుణం చోటుచేసుకుంది. అక్టోబర్ 24న జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ పోలీసులు పికెట్ పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన SUV పోలీసులను ఢీకొట్టి అంతే వేగంగా వెళ్ళిపోయింది. కారు పికెట్ ను ఢీకొట్టడంతో పోలీసు సిబ్బంది గాలిలో ఎగిరి చాలా అడుగుల దూరంలో పడ్డారు. అందులో రవి సింగ్ అనే కానిస్టేబుల్ ను ఆ కారు కొంత దూరం ఈడ్చుకుని వెళ్లినట్లు కూడా కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ రవి సింగ్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అతని ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..Delhi viral video: కానిస్టేబుల్ ను ఢీకొట్టిన కారు.. ఢిల్లీలో షాకింగ్ ఘటన
ఢిల్లీలో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను SUV బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లో ఎగిరిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Translate this News:











