Venkatagiri Poleramma Jathara: పోలేరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైయింది. ఇప్పటికే ఘటోత్వాన్ని నిర్వహించారు. ఈనెల 4,5న జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలేరమ్మవారిని అమ్మవారినిగా భావించే వెంకటగిరిలో చాకలివీధిలో పుట్టమట్టితో చాకలి కుటుంబాల వారు తయారు చేస్తారు. అమ్మవారిని ఇక్కడ కళ్ళు మాత్రం పెట్టకుండా అలంకరిస్తారు. అత్తవారిల్లుగా భావించే జీనుగుల వారి వీధికి తీసుకెళ్లి అమ్మవారిని అక్కడ కళ్ళు పెట్టి బంగారు నగలతో అలంకరిస్తారు. అక్కడ నుంచి లక్షలాది మంది భక్తుల నడుమ రథంపై ఊరేగింపుగా అమ్మవారి గుడి వద్దకు తీసుకువచ్చి భక్తుల దర్శనార్థం ఉంచుతారు.
పూర్తిగా చదవండి..AP State Festival: వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర
పోలేరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైయింది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. 1992లో దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి పోలేరమ్మ ఆలయాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖవారు తీసుకొచ్చారు. పోలేరమ్మ జాతరను సాంప్రదాయంగానే రాజులు సూచన, సలహాలతో నిర్వహిస్తున్నారు.

Translate this News:











