PM Narendra Modi Public Meeting: పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తెలంగాణ(Telangana) ఎన్నికలకు సమరశంఖం పూరించారు. తెలంగాణ మార్పు కోరుకుంటోందని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం అని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అవినీతి సర్కార్ కాదు.. పారదర్శక ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కమీషన్లు, కరప్షన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతం అని ఘాటైన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పేరు చెప్పుకుని, ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ప్రాజెక్టుల మీరు మీద ఆర్భాటాలు, హంగామాలు జరుగుతాయిన ఆనీ.. రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వరని విమర్శించారు ప్రధాని మోదీ. రుణ మాఫీ చేస్తామని చెప్పి.. ఎందరో రైతుల మరణాలకు కారణం అయ్యారని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. కారు స్టీరింగ్ ఎవరి చేతిలో అందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా మార్చాయని విమర్శించారు. ఆ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంటూ సెటైర్లు వేశారు. పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులుంటారు.. తమ అవసరాల కోసం కొందరు బయటి వ్యక్తులు ఉంటారంటూ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై నెక్ట్స్ లెవల్ పంచ్‌లు..
పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. తెలంగాణ మార్పు కోరుకుంటోందని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం అని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అవినీతి సర్కార్ కాదు.. పారదర్శక ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు.

Translate this News:











