PM Modi Telangana Tour: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండంతో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే దూకుడు పెంచాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS) ను ఢీకొట్టడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తుండగా… ఇప్పటికే కాంగ్రెస్ కీలకమైన విజయభేరి సభతో పాటు హామీలను ప్రకటించింది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటంతో పాటు… పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. నిజామాబాద్ (Nizamabad)లో జరిగే మోడీ సభను ధన్యవాద్ సభగా (Modi Public Meeting) జరపనున్నారు. పాలమూరు వేదికగా పసుపు బోర్డు (National Turmeric Board) ఏర్పాటు చేస్తున్నట్లు మోడీ ప్రకటించటంతో ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బీజేపీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
పూర్తిగా చదవండి..PM Modi Telangana Tour: తెలంగాణలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటూ 8021కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజామాబాద్ లో బీజెపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా పేరు పెట్టారు.

Translate this News:











