Modi meets Praggnanandhaa: భారత యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. 18 ఏళ్ల టీనెజ్ సంచలనం, ఇటీవల FIDE ఫైనల్లో రజత పతకం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగానే మోదీని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రజ్ఞానంద ట్విట్టర్లో షేర్ చేయగా. దాన్ని మోదీ రీట్వీట్ చేశారు. “గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలవడం గొప్ప గౌరవం!” ప్రజ్ఞానంద తన ట్వీట్లో రాశాడు. “ఈరోజు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చారు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, మీ కుటుంబంతో పాటు. మీరు అభిరుచి, పట్టుదలని వ్యక్తీకరిస్తారు. దేశ యువత ఏ డొమైన్‌ను ఎలా జయించగలదో చూపిస్తుంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది” అని మోదీ రీట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Modi meets Praggnanandhaa: నీ పట్టుదలకు ఫిదా బాసూ.. మోదీని కలిసిన ప్రజ్ఞానంద..!
ప్రధాని మోదీని కలిశారు చెస్ ప్రాడిజీ ప్రజ్ఞానంద. మోదీ నివాసంలో ప్రజ్ఞానంద, అతని కుటుంబసభ్యులు మోదీని కలిశారు. ఇటివలి FIDE టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న ప్రజ్ఞానంద ఆ పతకాన్ని మోదీకి చూపించాడు. ఇక ఇప్పటికే ప్రజ్ఞానందకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రూ.30 లక్షల చెక్కును అందించి మెమెంటోను బహుకరించారు.

Translate this News:












