చంద్రయాన్ -3 విజయం, ఆదిత్య ఎల్- 1 ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారతదేశం ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఆ విజయ పరంపరను కొనసాగిస్తూ రానున్న 20ఏళ్లకు మరిన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధాని మోదీ దేశ శాస్త్రవేత్తలకు సూచించారు. మరో 10ఏళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు కాలుమోపేలా లక్ష్యం పెట్టుకోవాలని ప్రధాని నిర్దేశం చేశారు. గగన్ యాన్ మిషన్ లో భాగంగా మొదటి వెహికల్ డెవలప్ మెంట్ ఫ్లైట్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను అక్టోబర్ 21న పరీక్షించనున్నారు. ఈ కార్యక్రమం ప్రయోజ ఏర్పాట్లపై ప్రధాని మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలపై శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు.
పూర్తిగా చదవండి..PM Modi : చంద్రుడిపైకి తొలిభారతీయుడు..దేశ శాస్త్రవేత్తలకు మోదీ సూచన..!!
2040నాటికి భారతీయుడు చంద్రుడిపై కాలుమోపేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు. మన సొంతంగా భారత అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేకునే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. భారత్ యొక్క గగన్యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తు రూపురేఖల తయారీకి సంబంధించి చర్చించారు.

Translate this News:











