PM Modi ISRO Visit : దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi) శనివారం బెంగళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతమైన తర్వాత శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు బెంగళూరు వచ్చారు. చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తల (ISRO Scientists)తో ఆయన సంభాషించారు. ఈ తరుణంలో ప్రధానిమోదీకి ఘనస్వాగతం పలికేందుకు బెంగళూరు(Bangalore)లోని హెచ్ఏఎల్ విమానాశ్రయం వెలుపల గుమిగూడిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై జవాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అంటూ నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..PM Modi ISRO Visit : ఇస్రోలో ప్రధాని మోదీ… బృందాన్ని అభినందించిన ప్రధాని..!!
చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISTRAC) మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌ను కలుసుకుని చంద్రయాన్-3 మిషన్ విజయవంతానికి అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోదీ ఉదయం బెంగళూరు చేరుకున్నారు.

Translate this News:











