KTR in Physically Challenged Thanksgiving Meeting: సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ మాట్లాడుతోందంటూ హస్తం పార్టీపై (Congress Party) ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్(Minister KTR). నాణ్యమైన నీటిని ఇవ్వకుండా లక్షన్నర మందిని దివ్యాంగులుగా మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని.. మనం వాళ్ళకి ఇచ్చింది ఒక్క ఛాన్స్ కాదు 11 ఛాన్సులని గుర్తు చేశారు కేటీఆర్. 55 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చామన్నారు. మీ దిక్కుమాలిన పాలన వల్ల నల్లగొండలో (Nalgonda) లక్షల మంది పిల్లలు అంగవైకల్యం బారిన పడ్డారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏ జిల్లాకు పోయినా ఫ్లోరోసిస్ (Fluorosis) బాధితులు కనబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
పూర్తిగా చదవండి..KTR: లక్షన్నర మందిని దివ్యాంగులుగా చేసిన పాపం కాంగ్రెస్ దే: కేటీఆర్
దివ్యాంగుల పింఛన్‌ను పెంచుతామన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం రూ.4,016 పింఛన్ ఇస్తున్నామని.. కేసీఆర్ మళ్లి సీఎం అవ్వగానే రూ.6,016కు పెంచుతామని చెప్పారు. అటు తెలంగాణలో లక్షలమంది దివ్యాంగులగా మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు.

Translate this News:











