నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ వసతి గృహంలో గురువారం జరిగిన ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని న్యాయవాది చిక్కూడి ప్రభాకర్ హైకోర్టులో వేసిన పిటీషన్లో తెలిపారు. హాస్టల్లో ఉన్న సమారు 300 మంది విద్యార్థినులు కడుపునొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ ఫిల్లో వెల్లడించారు. గురువారం రాత్రి సమారు 150 మంది బాలికలను అంబులెన్స్‌లో కాకుండా గొర్రెలు, బర్రెలను తరలించే వాహనాల్లో తీసుకెళ్లారన్నారు. ఇందులో సుమారు 15 మంది విద్యార్థినుల పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. కాగా దీనిపై స్పందించిన హైకోర్టు ఫుడ్ పాయిజన్‌పై కేసు మంగళవారం విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్టార్‌ను ఆదేశించింది.
పూర్తిగా చదవండి..నాగర్ కర్నూల్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్
నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ వసతి గృహంలో గురువారం జరిగిన ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని న్యాయవాది చిక్కూడి ప్రభాకర్ హైకోర్టులో వేసిన పిటీషన్లో తెలిపారు.

Translate this News:











