సార్వత్రిక ఎన్నికలకు మరో 10నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటినుంచే అగ్రనేతలు పోటీచేసే నియోజకవర్గాల నుంచి జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈసారి ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మోదీ ఇంటిపేరు పరువునష్టం కేసులో సూరత్ కోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయారు. చివరకు సుప్రీంకోర్టు సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో మళ్లీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మళ్లీ ఎక్కడ నుంచి పోటీలో ఉంటారనే చర్చ ప్రస్తుతం తీవ్రంగా జరుగుతోంది. అయితే గతంలో రాహుల్ ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. 2019 ఎన్నికల్లో అమేథీతో పాటు వయనాడ్ నుంచి ఎంపీగా పోటీచేశారు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీ చేతిలో ఓడిపోగా.. వయనాడ్లో గెలిచారు.
పూర్తిగా చదవండి..అమేథీ నుంచి రాహుల్ పోటీచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు: అజయ్
దేశంలోని అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో 10నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటినుంచే అగ్రనేతలు పోటీచేసే నియోజకవర్గాల నుంచి జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈసారి ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Translate this News:











