కావలి నియోజకవర్గం, అల్లూరు మండలంలోని పోలేరమ్మ దేవస్థానం దగ్గర నూతనంగా నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించి ఆయన అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీపై నిరాధార ఆరోపణలు, టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అణచివేత ధోరణితో జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజా సమస్యలతో సహా రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య లేవనెత్తినా, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినా..? అక్రమ అరెస్టులకు పాల్పడటం జగన్ రెడ్డికి, పోలీస్ వ్యవస్థకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి, చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి దాదాపు 3 వారాలు దాటింది. ఇంతవరకు ఒక్క ఆధారం బయట పెట్టలేకపోయారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..AP Politics: ఏపీ నీడ్స్ జగన్ నినాదం జనాన్‌లో బెడిసికొట్టింది, “ఏపీ క్విట్ జగన్ ” నినాదం ఊపందుకుంది
వైనాట్ 175 అన్న జగన్ నినాదం తారుమారై... టీడీపీ విషయంలో నిజం కానుంది. జగన్‌రెడ్డిని ఇంటికి పంపి.. చంద్రబాబుని గెలిపించాలని ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ వ్యాఖ్యనించారు.

Translate this News:











