సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాలు చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కాంట్రాక్టు లెక్చరర్ల పాత్ర కీలకంగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని, ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇంతవరకు వారి ఉద్యోగాలకు భరోసా ఇవ్వలేకపోయారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని క్రమబద్దీకరణ చేయకపోగా.. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని రేవంత్ రెడ్డి కోరారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy: సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ
సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఇంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రకటించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా వ్యవహరించడం కేసీఆర్కు అలవాటైందన్నారు.

Translate this News:











