PawanKalyan Fires On YCP Govt: ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. కేవలం భూముల మీదే ప్రేమ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల్లేవని, జాబ్ క్యాలెండర్ లేదని.. కానీ విస్సన్నపేట గ్రామంలో 13వేల కోట్ల రూపాయలతో అనుమతులు లేనిచోట రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక్కడ ఉన్న 600 ఎకరాలు భూములను కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఉరిలోకి రావడానికి సరైన రోడ్డు లేదని.. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ను కాదు.. సీఎంనే అడుగుతున్నా.. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకమని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: పవన్
ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు.

Translate this News:











