Pawan Kalyan silence: ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్న చంద్రబాబుకు ఐటి నోటీసులు అంశం..చివరకు పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులు తెచ్చే పెట్టేట్లు కనబడుతుంది అనే చర్చ నడుస్తుంది.. చంద్రబాబుకు ఇచ్చిన ఐటి నోటీసులు పై చంద్రబాబు, ఆ పార్టీ నేతలు స్పందించి దానిపైన క్లారిటీ కూడా ఇచ్చారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నోరు మెదపాలని నిన్న, మొన్నటి వరకు డిమాండ్ చేసిన వైసీపీ..ఐటి నోటీసుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదంటూ ..పవన్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సందిస్తుంది..టీడీపీని వదిలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి దిగుతుంది..చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారంలో ఆ పార్టీ సైలెంట్ గా ఉండడం సహజంగా జరిగేది..కానీ, చంద్రబాబుకు నోటీసుల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు..ఇదే ఇప్పుడు అధికార పార్టీ నేతలు వేస్తున్న ప్రశ్న. అధికార పార్టీ నేతలే కాదు ఆయన అభిమానిస్తున్న జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు..చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు ప్యాకేజి ఇస్తేనే పాలిటిక్స్ చేస్తాడంటూ వైసీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వారి పై కౌంటర్ ఇచ్చారు, విరుచుకు పడ్డారు.ఐటీ నోటీసుల వ్యవహారంలో స్పందించకపోవడానికి కారణం ఏంటని చర్చ ఆ పార్టీలో కూడా నడుస్తుంది.పొత్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే చంద్రబాబుని పై ఎలాంటి విమర్శలు చేయకపోవడం…కళ్యాణ్ కి రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కునే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది..
పూర్తిగా చదవండి..Pawan Kalyan : “బ్రో”కి ఏమైంది..మౌనం ఎవరి కోసం?
అవును పవన్ కళ్యాణ్ బ్రో కి ఏమైంది.. మొన్నటి వరకు బాక్సులు బద్దలయ్యేలాగా స్పీచ్ లతో అదరగొట్టిన బ్రో ఏమైపోయాడు?. అధికార పార్టీ చంద్రబాబును వదిలేసి నిన్ను టార్గెట్ చేసిన ఎందుకు నోరు మెదపడం లేదు?. పవన్ కళ్యాణ్ మౌనం వ్యూహంలో భాగమా?.పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఆయనకి ఇబ్బందులు తెచ్చి పెడుతుందా?. బ్రో మౌనానికి మూల కారణం ఏంటి?. బ్రో ఎప్పుడు మాట్లాడుతారు?

Translate this News:











