వారాహియాత్ర మూడో దశలో ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ నిన్ను కేంద్రం చేత ఓ ఆట ఆడించకపోతే నన్ను అడుగు.. జగన్ అనే వాడు నాయకుడు కాదు.. వ్యాపారి అంటూ పరుష పదజాలంతో విమర్శించారు. ఇక్కడ దోపిడీ చేస్తున్న వైసీసీ ఎమ్మెల్యేలు అందరి జాతకాలు కేంద్రం వద్ద ఉన్నాయని హెచ్చరించారు. ప్రశాంతమైన విశాఖలో ప్రస్తుతం గుండాలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. అలాంటి గుండాలు నుంచి రక్షించాడానికి ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నారు. గుండాలకు తాము బెదిరిపోమన్నారు. విశాఖ జిల్లాను వైసీపీ విముక్త ప్రాంతంగా చేస్తామని.. చొక్కాలు పట్టుకుని నిలదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాలంకు రంగు రుచి ఉండదు కాలంతో పాటు ఎవ్వరైనా పరుగెత్తాల్సిందేన్నారు. ఉదయం పథకాలు కింద ఖాతాల్లో డబ్బులు వేసి.. సాయంత్రం సారా కింద పట్టుకుపోతున్నారన్నారు.
పూర్తిగా చదవండి..జగన్ నిన్ను కేంద్రం చేత ఓ ఆట ఆటాడిస్తా: పవన్
ప్రశాంతమైన విశాఖలో ప్రస్తుతం గుండాలు రాజ్యమేలుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారాహియాత్ర మూడో దశ ప్రారంభం సందర్భంగా విశాఖ వచ్చిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Translate this News:











