Varun, Lavanya Wedding: మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ జూన్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే వారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల మధ్య చాలా ఘనంగా జరిగాయి. ఇక వీరిద్దరికి నవంబర్ 1 న వివాహం జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వరుణ్, లావణ్య ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. అయితే ఇప్పటికే వరుణ్, లావణ్య పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకొని ఇటలీ బయలుదేరారు. తాజాగా రాంచరణ్, ఉపాసన తమ కూతురుతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిహారికతో పాటు పలు మెగా కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకల కోసం ఇటలీ చేరుకున్నారు. మెహందీ, సంగీత్, వెడ్డింగ్ ఇలా మూడు రోజుల పాటు వరుణ్, లావణ్యల పెళ్లి ఘనంగా జరగబోతుంది. ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి సందడి చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Varun, Lavanya Wedding: వరుణ్, లావణ్య పెళ్లి కోసం ఇటలీకి పవర్ స్టార్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్!
వరుణ్ తేజ్, లావణ్యల వివాహ వేడుకలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దంపతులు ఇటలీకి బయలుదేరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇప్పటికే రాంచరణ్ దంపతులతో పాటు నిహారిక ఇటలీ వెళ్లి సందడి ప్రారంభించిన సంగతి తెలిసిందే!

Translate this News:














