– వారాహి యాత్రతో జనసేనలో జోష్
– తనదైన రీతిలో పంచ్ లు విసురుతున్న పవన్
– ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు
– సీఎం అవుతానని గట్టిగా చెబుతున్న జనసేనాని
– పవన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటి?
– నిజంగా జనసేన పుంజుకుందా..?
– లేక ఇంకేదైనా ఉస్తాద్ ప్లాన్ ఉందా..?
నేనే సీఎం.. పవన్ ధీమా ఏంటి..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓటర్లను అభ్యర్థించారు. ఒక్కసారి తమకు అధికారం ఇచ్చి చూడాలని, ఏపీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానని కోరారు. ‘‘పిఠాపురం సాక్షిగా.. దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి.. మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి’’ అని పవన్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఎమ్మెల్యే అవ్వాలన్నా, సీఎం అవ్వాలన్నా ప్రజలు ఓట్లు వేయాలని వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తున్నారు.

Translate this News:












