Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ- జనసేన పొత్తుల ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది. 12:30 గం.లకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు వెళ్లనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి పార్టి కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్నారు .
పూర్తిగా చదవండి..Pawan Kalyan: టీడీపీ, జనసేన మధ్య ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోంది..?
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మూడేళ్లుగా పొత్తు ప్రతిపాదనల్లో ఉన్న టీడీపీ, జనసేన ఓ క్లారిటీకి వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏకి ఏకైక భాగస్వామిగా ఉన్న జనసేన.. ఆ స్నేహాన్ని పక్కన పెడుతుందా? లేక టీడీపీని ఎన్డీఏ భాగస్వామి చేసేలా అడుగులు వేస్తుందా? జనసేనాని పవన్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి? టీడీపీ, జనసేన మధ్య ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోంది..? అన్నదే తేలాల్సివుంది.

Translate this News:











