TDP-JSP: టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పోటీ చేయబోయే స్థానాలపై ఆ పార్టీలో చర్చ ఊపందుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీతో పొత్తు-సీట్లు అంశమే ప్రధానంగా చర్చకొచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీట్ల విషయంలో మనం వెనక్కి తగ్గొద్దని జనసేన నేతలు పవన్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత 40 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ మైలేజ్ తగ్గిందనీ, అదే సమయంలో వారాహి యాత్రతో జనసేన క్రేజ్ భారీగా పెరిగిందనీ, ఇలాంటి సమయంలో సీట్ల విషయంలో జనసేన రాజీ పడాల్సిన అవసరం లేదంటూ పవన్ కళ్యాణ్ వద్ద పార్టీ నేతలు చెప్పుకొచ్చినట్లు సమాచారం. అయితే, గతంలో 30 సీట్ల దాకా ఉన్న అంచనాలు ప్రస్తుతం టీడీపీకి మైలేజ్ తగ్గిన పరిస్థితుల్లో మరింతగా పెరుగుతున్నాయి. కనీసం 50 సీట్లకు తగ్గకూడదని జనసేన నేతల నుండి డిమాండ్ వినిపిస్తోంది. అలాగే ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ టీడీపీ క్లారిటీ ఇవ్వాల్సిందేనని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. టీడీపీ-జనసేన ఉమ్మడిగా అధికారంలోకి వస్తే సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఎలా ఉండాలన్న దానిపై మాజీ హోం మంత్రి, జనసేన సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ అంశాలను కూడా జనసేన నేతలు పవన్ వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..టీడీపీకి మైలేజ్ తగ్గింది..పవన్‌పై జనసేన నేతల ఒత్తిడి..!!
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ ప్రభంజనం తగ్గిందనీ, అదే సమయంలో వారాహి యాత్రతో జనసేన క్రేజ్ పెరిగిందని, ఇలాంటి సమయంలో సీట్ల విషయంలో వెనక్కి తగ్గొద్దని జనసేన అధినేత పవన్‌కు ఆ పార్టీ సీనియర్ల నుండి ఒత్తిడి ఎదురవుతోంది. అయితే, గతంలో 30 సీట్ల దాకా ఉన్న అంచనాలు ప్రస్తుతం టీడీపీకి మైలేజ్ తగ్గిన పరిస్థితుల్లో మరింతగా పెరుగుతున్నాయి. కనీసం 50 సీట్లకు తగ్గకూడదని జనసేన నేతల నుండి డిమాండ్ వినిపిస్తోంది.

Translate this News:











