పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. అక్కడి పౌరులు జీవించడమే గగనమయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చిన్న చిన్న వస్తువుల నుంచి ఫ్యూయెల్, ఇంధనాల వరకు అన్నీ ప్రియంగా మారిపోయాయి. తాజాగా పాకిస్తాన్ లో ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో అక్కడి ఇంటర్నేషనల్ విమాన సంస్థ తమ ఫ్లైట్లను రద్దు చేసింది. విమానాలు నడపాలంటే ఇంధనం అవసరం కదా. మరి ఆ చమురే ఇప్పుడక్కడ బంగారమైపోయింది. తీవ్ర కొరత ఏర్పడింది. అందుకే పాక్ ఎయిర్ లైన్స్ అన్ని విమానాలనూ పక్కన పెట్టేసింది. సరిపడినంత ఇంధన సరఫరా లేకపోవడం వల్లే ఫ్లైట్లను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్స్ ప్రతినిధులు తెలిపారు. 13 డొమెస్టిక్ ఫ్లైట్స్, 11 ఇంటర్నేషనల్ ఫ్లైట్లను రద్దుచేశారు. మిగతా వాటిన రీషెడ్యూల్ చేశారు. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇతర మార్గాలను చూపిస్తోంది.యిర్పోర్ట్కి వచ్చే ముందే ఫ్లైట్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
పూర్తిగా చదవండి..Pakistan:పాపం పాకిస్తాన్…ఫ్యూయల్ లేక ఆగిన 48 ఫ్లైట్లు
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడి ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిత్యావసర వస్తువులే కాక చమురు లాంటివి కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 48 ఫ్లైట్లను పూర్తిగా రద్దు చేసింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీస్లు నిలిపివేసింది.

Translate this News:











