తెలంగాణ సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీఆర్ఎస్ ను గెలిపించాం, ఇప్పుడు కేసీఆర్ ఇలా చేస్తారని మేం ఊహించలేదని అన్నారు. కేసీఆర్ స్వయంగా మమ్మల్ని మద్దతు అడిగారు. అప్పుడు అతిథి సత్కారాలు కూడా చేశారు. ఇప్పుడు ఇలా చేయటం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్కు స్నేహం ఉందా ? బీజేపీ అండదండల కోసమే బీఆర్ఎస్ పని చేస్తోందని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ మిత్రధర్మాన్ని తప్పారు, బీఆర్ఎస్ ను ఓడించటమే మా ఎన్నికల నినాదం: సీపీఐ, సీపీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రధర్మం మరిచి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించారని ధ్వజమెత్తారు.కేసీఆర్ ఏంటనే విషయం ఇప్పుడు తెలిసిందని అన్నారు. బీఆర్ఎస్ నిర్ణయంపై చాలా మంది కలత చెందారని అన్నారు. బీఆర్ఎస్ను ఓడించాలన్నదే తమ ఎన్నికల నినాదం అని స్పష్టం చేశారు.

Translate this News:











