పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ వార్ ఖమ్మం రాజకీయాలలో కలకలం రేపుతోంది. తెలంగాణ పాలిటిక్స్ లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి చేరగానే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రచార కమిటీలో వైస్ ఛైర్మన్ గా నియమిస్తూ కీలక బాధ్యతలను అప్పగించింది. మరో వైపు ఖమ్మంలో ఆయన అనుచరులు ఆయనతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఇతర పార్టీల్లోని నేతలను ముఖ్యంగా జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ సెకండ్ క్యాడర్ నేతలను సైతం పొంగులేటి కాంగ్రెస్ లోకి లాగుతున్నారు.
పూర్తిగా చదవండి..ఆపరేషన్ హరీష్ : పొంగులేటికి షాక్ ఇచ్చేలా ఆయన ముఖ్య అనుచరునికి గాలం
మాజీఎంపీ, ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు అధికారపక్షం బీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇక మొదటి నుంచి పొంగులేటి వెంటే ఉన్న తెల్లం వెంకటరావు ఆయన్ని విడిచి.. పొంగులేటి బయటికి వచ్చిన పార్టీలోనే జాయిన్ అవ్వడం బిగ్ షాక్ ఇచ్చింది.

Translate this News:












