Operation Ajay Israel: ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం అన్ని చర్యలు చేస్తామని, దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar). ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ అజయ్ కోసం
ప్రత్యేక చార్టర్ విమానాలను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్ లో ప్రస్తుతం 18వేల మంది భారతీయులు చిక్కుకున్నారని ముంబయిలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషని (Kobbi Shoshani) చెప్పారు.
Israel-Palestine Conflict:ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అపరేషన్ అజయ్
ఇజ్రాయెల్, మమాస్ ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ సంకల్పించింది. ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న 18వేల మంది భారతీయులను దీని ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు.

Translate this News:











