ఒకప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే బస్సులు, రైళ్లలోనే ఎక్కువగా ప్రజలు ప్రయాణాలు చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మెట్రో రైళ్లు రావడంతో ప్రజలకు ప్రయాణం మరింత సుగమమైంది. ప్రతిరోజూ చాలామంది ఈ మెట్రో ప్రయాణాలనే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో ప్రయాణాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ మెట్రోల్లో దాదాపు కోటి మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ప్రారంభమైన 16వ అర్బన్ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఆయన.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20 నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..Metro: దేశంలో ప్రతిరోజూ ఎంతమంది మెట్రో రైళ్లో ప్రయాణిస్తున్నారో తెలుసా..
చాలామంది ప్రయాణికులు సులభంగా, వేగంగా తమ గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో రైళ్లో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే దేశవ్యాప్తంగా నిత్యం కోటి మంది మెట్రోల్లో ప్రయాణిస్తున్నారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. దేశంలో 20 నగరాల్లో దాదాపు 895 కిలోమీటర్ల మేర మెట్రో వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు.

Translate this News:











