Lunar Eclipse October 2023: హిందూమత ఆచార సంప్రదాయాలు, హిందూ మత గ్రంధాల ప్రకారం చంద్ర గ్రహణం, సూర్య గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వేద పండితులు.. ఈ గ్రహణాలను ప్రజలు నేరుగా చూడొద్దని చెబుతుంటారు. చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయిని హెచ్చరిస్తుంటారు. అంతేకాదు.. గ్రహణాలు ముగిసిన తరువాత కొన్ని శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తారు. ఆలయాల్లోనూ పూజారులు శుద్ధి చేస్తారు. అదే మాదిరిగా ప్రజలు తమ తమ ఇళ్లలోనూ శుద్ధి చేసుకోవాలని చెబుతారు. అయితే, ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన ఏర్పడింది. ఇది చాలా ప్రత్యేకమైంది. అయితే, చంద్రగ్రహణం సమయంలో కొన్ని వాస్తు పరిహారాలు పాటిస్తే జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వేదార్చకులు, జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ పరిహారాలేంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Lunar Eclipse: చంద్ర గ్రహణం తరువాత ఇలా చేస్తే.. 10 సంవత్సరాల వరకు ఆర్థిక సమస్యలే ఉండవు!
ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ సంవత్సరం ఏర్పడిన చివరి చంద్రగ్రహణం ఇదే. అయితే, చంద్రగ్రహణంతో మంచి, చెడులు రెండూ జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం తరువాత కొన్ని వాస్తు పరిహారాలు పాటిస్తే.. ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయట. చంద్రగ్రహణం తరువాత ఇంట్లో ఉన్న గుడిని శుభ్రం చేసి, దేవుళ్లను మళ్లీ అలంకరించాలి. పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు.

Translate this News:











